Namaste NRI

ఆ మూడు కంపెనీల‌పై అమెరికా ఆంక్ష‌లు

పాకిస్థాన్‌కు ర‌హ‌స్యంగా బాలిస్టిక్ క్షిప‌ణి టెక్నాల‌జీ ని అంద‌జేసిన‌ మూడు చైనీస్ కంపెనీల‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది. లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాల‌జీని కూడా పాక్‌కు ఇచ్చిన‌ట్లు చైనా కంపెనీల‌పై ఆరోప‌ణ‌ లు ఉన్నాయి. జియాన్ లాంగ్డే టెక్నాల‌జీ డెవ‌ల‌ప్మెంట్‌, తియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌, గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు బెలార‌స్‌కు చెందిన మిన్స్క్ వీల్ ట్రాక్ట‌ర్ కంపెనీపై కూడా ఆంక్ష‌లు విధించారు. ఈ కంపెనీలు మాన‌వ హ‌న‌న ఆయుధాల త‌యారీ వ్యాప్తికి కార‌ణం అవుతున్నాయ‌ని, అయితే ఒక‌వేళ పాకిస్థాన్ ఆ ఆయుధాల త‌యారీ, ర‌వాణాకు పాల్ప‌డితే స‌మ‌స్య‌గా మారే ప్ర‌మాదం ఉంద‌ని అమెరికా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి మాథ్యూ మిల్ల‌ర్ తెలిపారు.

ఆయుధాల ప్రొక్యూర్మెంట్‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని, ఆయుధాల స‌ర‌ఫ‌రాకు పాల్ప‌డుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మిల్ల‌ర్ తెలిపారు. పాకిస్థాన్‌కు మిత్ర‌దేశ‌మైన చైనా,  ప్ర‌ధానంగా ఆయుధాలు, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తు ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. పాకిస్థాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్‌ మిస్సైల్‌కు కావాల్సిన వెహిక‌ల్ ఛాసిస్‌ను మిన్స్క్ వీల్ ట్రాక్ట‌ర్ ప్లాంట్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. మిస్సైల్‌కు చెందిన ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్‌ను చైనాకు చెందిన లాంగ్డే కంపెనీ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్ల ద్వారా రాకెట్ మోటార్ కేసుల్ని ఉత్ప‌త్తి చేస్తారు. తంజిన్ సంస్థ స్టిర్ వెల్డింగ్ ఎక్విప్మెంట్‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events