టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఈడీ ఎదుట హాజరైన సినీనటి చార్మి విచారణ జరిగింది. ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 8 గంటలకు పైగా సాగిన విచారణలో చార్మి బ్యాంకు ఖాతాల వివరలను అధికారులు పరిశీలించారు. అనుమానస్పద లావాదేవీలపై ఆరా తీశారు. 2017లో డ్రగ్స్ కేసులో చార్మి ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్నారు. కెల్విన్ సమాచారం అధారంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్ నుంచి బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్, ఇద్దరు అనుచరుల ఫోన్లలో గతంలో లభించిన తారల వివరాల ఆధారంగానే నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 8 మంది సరఫరాదాల బ్యాంకు ఖాతాలు సేకరించి అధికారులు, అనుమానస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పా. అధికారుల దర్యాప్తునకు అన్ని విధాల సహరిస్తా. నన్ను అడిగిన బ్యాంక్ పత్రాలు ఈడీ అధికారులకు ఇచ్చాను. కేసు దర్యాప్తు దృష్టా ఎక్కువగా మాట్లాడలేను అని చార్మి తెలిపారు.