ఉక్రెయిన్ అధ్యక్షుడు వాలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అద్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. వీరిద్దరిపై నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం నిర్దిష్టంగా పేర్కొనలేదు. వారి పేర్లు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్ప టికీ ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇదే వాంటెడ్ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ సహా నాటో సభ్యదేశాలకు చెందిన పలువురు శాసనకర్తలు అధికారులు ఉన్నారు.