ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 23 దేశాలకు చెందిన ఎన్నికల సంఘాల ప్రతినిధులు మన దేశానికి విచ్చేశారు. రష్యా, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు చిన్న చిన్న బృందాలుగా గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ల్లోని వివిధ నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, అమలవుతున్న సాంకేతికత తదితరమైనవి పరిశీలిస్తారు. ఇలా విదేశీయులు సందర్శించడం ఇదే తొలిసారి.