హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందు కుగానూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోర్టు మరోసారి కొరడా రళిపించింది. ఆయనకు వెయ్యి డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో గ్యాగ్ ఉత్తర్వులను 9 సార్లు ఉల్లంఘించారంటూ ట్రంప్‌నకు కోర్టు గతవారం 9 వేల డాలర్ల జరిమానా విధించిన సంగతి గమనార్హం. మరోసారి ఇదే తరహా ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని జడ్జి జువాన్ ఎం మెర్చన్ తాజాగా ఆయన్ను హెచ్చరించారు.