Skip to main content

Namaste NRI

బెల్లంకొండసాయి, మంచు మనోజ్‌, నారా రోహిత్‌, శ్రీనివాస్‌ భైరవం..  ట్రైలర్‌ లాంచ్‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలుగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ భైరవం. విజయ్‌ కనకమేడల దర్శకత్వం. కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు.

పవిత్ర వారాహి ఆలయం చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్‌ చెబుతున్నది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, స్వార్థ రాజకీయ వికృత చేష్టలు, ముగ్గురు స్నేహితుల గొప్ప స్నేహ బంధం, ఆలయాన్ని, దాని వారసత్వాన్నీ రక్షించేందుకు ఆ స్నేహితులు చేసే పోరాటం ఇవన్నీ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ సాగింది. ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్‌ వెంకట్‌, కెమెరా: హరి కె.వేందాంతం, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సమర్పణ: డా.జయంతిలాల్‌ గడా, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News