నాని నటిస్తోన్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ కథానాయిక. వివేక్ ఆత్రేయ దర్శకత్వం. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటిం గ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను నిర్మించారు. ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.