గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా గెటప్ శ్రీను చిరంజీవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడే తను హీరోగా నటించిన రాజు యాదవ్ ట్రైలర్ చూశాను. కొత్తదనం కనిపించింది. ఇందులో శ్రీను నవ్విస్తాడు, కవ్విస్తాడు, చక్కని వినోదాన్ని పంచుతాడు అని అన్నారు.
గెటప్ శీనుని చూస్తుంటే నాకు అప్పటి కామెడీ హీరో చలం గుర్తుకొస్తారు. గెటప్‌శ్రీను ప్రతిభకు హద్దులు లేవు అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అని శుభాంకాంక్షలందిం చారు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన విషయం విదితమే.