భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హత్యపై 44 ఏండ్ల తర్వాత కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాటెన్‌ను చంపింది తానేనని ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మాజీ కమాండర్ మైఖేల్ హేస్ చెప్పారు. మౌంట్‌బాటెన్ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవించిన థామస్ మెక్‌మహొన్‌కు తాను కమాండింగ్ అధికారినని చెప్పారు.
మౌంట్‌బాటెన్ పడవలో మెక్‌మహొన్ బాంబును పెట్టాడని, తానే ఆ పడవను పేల్చేశానని, చీఫ్ కమాండర్‌గా ఈ హత్యకు తానే ప్రణాళిక రచించానని హేస్ బయటపెట్టారు. తాను పేలుళ్లపై లిబియాలో శిక్షణ తీసుకున్న ట్టు చెప్పారు. ఇంగ్లండ్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌ను భాగంగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ మౌంట్‌బాటెన్‌ను ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ హత్య చేసింది.