1996లో విడుదలైన సినిమా భారతీయుడు. ఈ సినిమా ఆరోజుల్లోనే పాన్‌ఇండియా హిట్‌గా నిలిచింది. దానికి సీక్వెలే భారతీయుడు2. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలైలో పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. భారతీయుడు ని మించేలా విజువల్ వండర్‌గా భారతీయుడు 2 ను దర్శకుడు శంకర్ ఆవిష్కరిస్తున్నట్టు చిత్రబృదం చెబుతున్నది. అవినీతిపై సమరశంఖం పూరించిన స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతిగా మరోసారి కమల్‌హాసన్ తన నటవిశ్వరూపం చూపించనున్నట్టు మేకర్స్ చెబుతు న్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని వినూత్నంగా ముంబయిలోని స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రారంభించడం విశేషం.
జూన్ 1న చెన్నయ్‌లో ఈ మూవీ ఆడియో వేడుకను ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాత సుభాస్కరన్ తెలిపారు. ఎస్.జె.సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్, జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మా నందం, జాకీర్ హుస్సేన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్, కెమెరా: రవివర్మన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్.