బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపద గణనీయంగా పెరిగినట్టు సండే టైమ్స్ తాజా నివేదిక పేర్కొన్నది. ఆర్థికంగా బ్రిటన్ పరిస్థితి ఏమంతా బాగోలేదు. ఆ దేశానికి చెందిన బడా కోటీశ్వరు లు, ధనికులకు ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పటికీ గత ఏడాది కాలంలో రిషి సునాక్ దంపతుల సంపద సుమారుగా రూ.1291 కోట్లు పెరిగినట్టు నివేదిక ప్రస్తావించింది. అంతేకాదు వీరి ఆస్తులు బ్రిటన్ రాజు చార్లెస్-3 కంటే ఎక్కువని తేలింది.
సండే టైమ్స్ (రిచ్ లిస్ట్) విడుదల చేసిన జాబితా ప్రకారం, ప్రధాని రిషి సునాక్ దంపతుల సంపద రూ.5,598 కోట్ల (క్రితం ఏడాది) నుంచి రూ.6,889 కోట్లకు చేరుకుంది. బ్రిటన్ రాజు చార్లెస్-3 సంపద రూ.6,329 కోట్లుగా ఉందని పేర్కొన్నది. దేశంలో 2022లో బిలియనీర్లు సంఖ్య 177 కాగా, 2024 నాటికి వారి సంఖ్య 165కు తగ్గిందని తెలిపింది.