ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించిన సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చివరి అవకాశం ఇచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. పెన్నా ఛార్జ్ షీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు మరోసారి సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటర్ చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయిరెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడిరది.