అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపానుతో సంభవించిన వరదల్లో భారత సంతతికి చెందిన మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నిధి రాణా(18) ఆయుష్ రాణా(21 అనే విద్యార్థులు వెళ్తున్న కారు న్యూజెర్సీలోని పస్సాయిక్‌లో వరదలో కొట్టుకుపోయినట్లు తెలిసింది. పస్సాయిక్ ప్రాంతం యంత్రాంగం ఐదు పడవలు, మూడు డ్రోన్ల సాయంతో మెడ్‌డొనాల్డ్స్ బ్రూక్, పస్పాయిక్ నది ప్రాంతాల్లో గాలింపు చేపట్టింది. నిధి రాణా న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీ, ఆయుష్ రాణా మాంట్‌క్లెయిర్ స్టేట్ వర్సిటీలోనూ చదువుతున్నట్లు సమాచారం.