తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఊడల మర్రి వద్ద బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడనున్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజకార్లు ఊచకోత కోశారు. కాలక్రమంలో ఆ మర్రిచెట్టు వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. అదే వెయ్యి ఊడల మర్రి చెట్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన బహరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. తాను చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రేక్ ఇచ్చి నిర్మల్ జిల్లాలో జరిగే అమిత్ షా బహిరంగ సభలో పాల్గొనున్నారు.