కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూడటం, చదవడం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతున్నది. అటువంటి పోస్టులు వారికి చేరకుండా వారి తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ ఆమోదించింది. బాలలకు హాని కలిగించే కంటెంట్‌ను కట్టడి చేయడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుపై గవర్నర్ కేథీ హోచుల్ సంతకం చేస్తే, చట్టంగా అమల్లోకి వస్తుంది. కొన్ని రకాల పోస్టులను బాలలకు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల లోపు పంపించరాదని ఈ బిల్లు చెప్తున్నది. నిర్దేశిత పోస్టులను 18 సంవత్సరాల వయసు లోపు గలవారికి పంపించకూడదని తెలిపింది. అయితే టెక్ ఇండస్ట్రీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.