అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక, శారీరక పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఉన్న 81 ఏళ్ల కురువృద్ధుడైన ఆయన ఇటలీ ప్రధానికి ఎగతాళిగా సెల్యూట్ చేశారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాతో కూడిన జీ 7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలో జరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇతర దేశాధినేతలు కలిసి జీ 7 సమ్మిట్ లోగో ముందు ఫొటోలు దిగారు.
కాగా, ఈ ఫొటో షూట్ తర్వాత ఇటలీ ప్రధాని మెలోనితో బైడెన్ సంభాషించారు. ఆ తర్వాత వేదిక నుంచి వెళ్తూ ఎగతాళిగా ఆమెకు సెల్యూట్ చేశారు. ఇది చూసి నవ్వుకున్న మెలోని ఇతర దేశాధినేతల వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక, శారీరక పరిస్థితిపై మరోసారి మీమ్స్ వెల్లువెత్తాయి. ఆయన ప్రవర్తనను కొందరు సమర్థించగా మరికొందరు విమర్శించారు.