అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన ఆసక్తకిరంగా మారింది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో హెడ్‌లైన్స్‌లోకెక్కిన అధ్యక్షుడు, ఇప్పుడు తన విచిత్ర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ స్టేజ్‌పై బైడెన్ కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోయారు. ఎలాంటి చలనం లేకుండా స్టేజ్‌పై విగ్రహంలా నిల్చుండిపోయారు. ఇది గమనించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బైడెన్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
లాస్‌ఏంజెల్స్ లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పీకాక్ థియేటర్‌లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్ తో 45 నిమిషాల పాటు సరదాగా ఇంటర్వ్యూ జరిగింది. అనంతరం స్టేజ్‌పై ఉన్న బైడెన్, ఒబామా అక్కడున్న వారికి అభివాదం చూస్తూ కనిపించారు. ఆ సమయంలో బైడెన్ దాదాపు 10 సెకన్లపాటు నిశ్చలంగా నిల్చుండిపోయారు. ఆయనలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించిన బరాక్ ఒబామా, బైడెన్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి నడిపించుకుని తీసుకెళ్లిపోయారు.