అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం సర్ఫీరా. లేడీ డైరెక్టర్ సుధా కొంగర, సూర్య కాంబోలో వచ్చిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించాడు. తాజాగా విడుదల చేసిన సర్ఫీరా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒరిజినల్ వెర్షన్‌లో సూర్యను మించిపోయేలా అక్షయ్ కుమార్ తన పాత్రలో జీవించేశాడని ట్రైలర్‌తో అర్థమవుతుందం టున్నారు మూవీ లవర్స్.
అంతేకాదు గత ఐదేళ్లలో విడుదలైన అక్షయ్ కుమార్ ట్రైలర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ ఇదేనని చెబుతు న్నారు. అబండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. తనిష్క్ బాగ్‌ఛీ, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తు న్నారు. జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.