కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడకముందే మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. అది కేవలం 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాజాగా జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా బారినపడ్డ కేసులు వెయ్యి దాటాయి. ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌ను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రో మ్ (ఎస్‌టీఎస్‌ఎస్) అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి ఉదయాన్నే పాదాల వాపు వస్తే, అది మధ్యాహ్నానికి మోకాలి ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ఏడాది జపాన్‌లో 2,500 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 30 శాతం మంది మరణించారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఇన్ఫెక్షన్‌ను ఐరోపా లోని మరో ఐదు దేశాలలో కూడా గుర్తించారు.