రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా చేరుకున్నారు. రాజధాని ప్యోంగ్యాంగ్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. నార్త్ కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్, పుతిన్‌ను సాదరంగా ఆహ్వానించారు. దాదాపు 9 గంటల పాటు పుతిన్, ఉత్తర కొరియాలో ఉండనున్నారు. ఆ ఇద్దరి నేతల మధ్య 90 నిమిషాల పాటు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు, కీలకమైన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిలిటరీ బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-99.jpg)
పుతిన్ రాక సందర్భంగా సెంట్రల్ స్క్వేర్ను కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. కిమ్ సంగ్ స్క్వేర్ వద్ద రంగురంగు ల బెలూన్లు ఎగురుతున్నాయి. భారీ ఎత్తున పరేడ్‌ను నిర్వహించనున్నారు. చిన్న పిల్లలు బెలూన్లు పట్టుకు న్నారు. పరేడ్ జరిగే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌లను రష్యా, నార్త్ కొరియా జెండాలతో అలంకరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-99.jpg)