రష్యాతో సైనిక ఒప్పందం కుదుర్చుకొని కొరియా ద్వీపకల్పంలో ఉద్రికత్తలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేయడానికి దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తన అణు యుద్దవాహక నౌకను పంపింది. థియోడర్ రూజ్‌వెల్డ్ నౌక బుసాన్ చేరుకుంది. ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. యుద్ధ సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రికత్తలు పెరిగాయి. తమకు పెను ప్రమాదం పొంచి ఉందని దక్షిణ కొరియా ప్రకటించింది. రష్యా రాయబారిని పిలిపించి తీవ్రంగా హెచ్చరించింది.