Namaste NRI

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం ఉదయం కన్నుమూశారు. 86 సంవత్సరాల ఈక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణికర్ణిక ఘాట్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగింది. వారణాసిలోని ప్ప్రముఖ వేద పండితుల లో ఒకరైన దీక్షిత్ పూర్వీకులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన వారైనప్పటికీ దీక్షిత్ కుటుంబం అనేక తరాలుగా వారణాసిలోనే నివసిస్తోంది.

దీక్షిత్ మృతి ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీకి చెందిన గొప్ప పండితులు, శ్రీరామజన్మభూమి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత మరణం ఆధ్యాత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటని యోగి  పేర్కొన్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన అందచేసిన సేవలు చిరస్మరణీయమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress