Namaste NRI

మధురం టీజర్‌ విడుదల

ఉదయ్‌రాజ్‌, వైష్ణవిసింగ్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం మధురం. ఎ మెమరబుల్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. రాజేశ్‌ చికిలే దర్శకుడు. ఎం.బంగార్రాజు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్‌ దశలో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. హీరో నితిన్‌ ఈ టీజర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. 1990 నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అప్పటి స్కూళ్ల వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు అన్నీ కళ్లకు కట్టేలా ఇందులో చూపించాం. అభిరుచి గల నిర్మాత దొరకడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అందరూ మనసుపెట్టి పనిచేసిన సినిమా ఇది అని దర్శకుడు చెప్పారు.

నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ  మా సినిమా టీజర్‌ లాంచ్‌ చేసిన నితిన్‌కి థ్యాంక్స్‌. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది. సినిమా అంతా కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్‌ వర్క్‌ జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం  అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో ఉదరు రాజ్‌, దర్శకుడు రాజేష్‌ చికిలే, నిర్మాత బంగార్రాజు, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌ వర్మ, టోనీ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events