సల్మాన్ ఖాన్, రజినీకాంత్ ఈ ఇద్దరికీ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకిం చి చెప్పనవసరం లేదు. మరి ఈ క్రేజీ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. మూవీ లవర్స్, అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ అరుదైన కాంబినేషన్ వినోదాన్ని అందించేందుకు రెడీ అయిం ది. ఇంతకీ తలైవా ను, సల్లూభాయ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోయే డైరెక్టర్ ఎవరనుకుంటున్నా రా? యంగ్ ఏజ్‌లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసే గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కోలీవుడ్ దర్శకుడు అట్లీ. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూ.1500 కోట్లు వసూళ్లు రాబట్టడం పక్కా అటున్నారు మూవీ లవర్స్. భారత సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు మరో భారతీయ సినిమా రెడీ అవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.