భాష, సంస్కృతి పరిరక్షణే సంస్థ లక్ష్యమని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ అమెరికాలో ఐదు దశాబ్దాల క్రితం భాష, సంస్కృతి, ఆచార వ్యవహారా లను పరరక్షించుకునేందుకు ఏర్పడిన తొలిసంస్థ జీడబ్ల్యూటీసీఎస్ అని అన్నారు. తన భాషను, సంస్కృతిని విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. ఈ 50 వసంతాల వేడుకల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందన లభించిందని ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే సుమారు ఐదు కోట్ల విరాళాలు ప్రకటించించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
నరేన్ కొడాలి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో సంస్కృతి, సంప్రదాయాలు మారుతున్నప్పటికీ తాము మాత్రం జీడబ్ల్యూటీసీఎస్ ద్వారా పండుగలను, సంప్రదాయాలను క్రమం తప్పకుండా పాటిస్తున్నామన్నారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య, వైద్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.
రవి పొట్లూరి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తెలుగువారిని ఒక గొడుగు కిందకు చేర్చి, తెలుగుజాతికి ఒక గుర్తింపు, గౌరవాన్ని జీడబ్ల్యూటీసీస్ తీసుకువచ్చిందన్నారు. గంగాధర్ నాదెండ్ల మాట్లాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని, వైభవ ప్రాభావాలను భావితరాలకు అందించే బాధ్యత ఈ తరంపై ఉందని గుర్తుచేశారు. అన్ని భాషల్లో, సంస్కృతుల్లో తెలుగువారు ముందుంటారని కొనియాడారు. మన్నవ సుబ్బారావు, జక్కంపూడి సుబ్బారాయుడు, ముల్పూరి వెంకట్రావు, సాయిసుధ పాలడుగు, సత్యనారాయణ మన్నె, అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సుశాంత్ మన్నె, రాజేష్ కాసరనేని, శ్రీవిద్య సోమ, సుష్మ అమృతలూరి, నాగ్ నెల్లూరి, అశోక్ దేవినేని, శ్రీనివాస్ పెందుర్తి, మురళి దొందిరెడ్డి, తేజ రాపర్ల, విజయ్ అట్లూరి, శ్రీనివాస్ గంగ, ఉమాకాంత్ రఘుపతి, యాష్ బొద్దులూరి, పద్మజ బేవర, చంద్ర మాలావతు, ప్రవీణ్ కొండక, వేణు జంగ, భాను మాగులూరి పాల్గొన్నారు.