నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 పేరిట హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. కళావేదిక (R.V.రమణ మూర్తి గారు), రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కే. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ఎన్టీఆర్ పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం, అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందం గా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని అన్నారు.