వరుణ్‌సందేశ్ హీరోగా చేస్తున్న సినిమా విరాజి. ఆద్యంత్ హర్ష దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడారు. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు. ఈ కేరక్టర్ కోసం రెడీ కావడానికి గంట సమయం పట్టేది. ఈ సినిమాకోసం అందరిలాగే నేనూ ఎైగ్జెటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో దర్శకుడు హర్ష పెద్ద స్థాయికి వెళతాడు. పాషన్ గల నిర్మాతలు దొరకడం ఈ కథ అదృష్టం అన్నారు.
నిర్మాత మహేంద్రనాథ్, హీరో వరుణ్‌సందేశ్ లేకపోతే ఈ సినిమా లేదని, ముఖ్యంగా మహేంద్ర నిర్మాతగా మాత్రమే కాక, ఓ టెక్నీషియన్‌గా సినిమాకు పనిచేశారని, వరుణ్ కెరీర్‌కు ఇది టైలర్‌మేడ్ కేరక్టర్ అని దర్శకుడు చెప్పారు.వరుణ్‌సందేశ్ కొత్త అవతారం ఈ సినిమా అని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తమకు అందరి సపోర్ట్ కావాలని నిర్మాత అన్నారు. ఇంకా నటి ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి, సంగీత దర్శకుడు ఎబినెజర్‌పాల్ తదితరులు మాట్లాడారు.