టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సారంగదరియా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. ప్రమోషనల్ ఈవెంట్లో రాజా రవీంద్ర మాట్లాడుతూ డైరెక్టర్ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్లోనే మొత్తం చెప్పేశాడు. ఫెయిల్యూర్ చాలా ప్రమాదం అని ట్రైలర్లో చూపించాడు. ఈ సినిమాలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలుంటాయి. నేను కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తూ అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లలకు నైతికంగా మద్దతు ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తా రు. కంటెంట్ బలంగా ఉన్న బలగం చాలా ఆడిందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న మన సినిమా హిట్ అవుతుందని నిర్మాత చెప్పారన్నాడు.
సున్తీ చేయించుకొని వచ్చావా అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన సారంగదరియా ట్రైలర్లో అయినా కులమం టే రక్తం కాదు సార్.. పుట్టుకతో రావడానికి, మనం చేసే పనే కులం సార్..అనే డైలాగ్‌తోపాటు మందు, సిగరెట్లు, పేకాట, బెట్టింగ్స్.. వీటన్నింటి కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీప డి బ్రతికేలా చేసేస్తుంది. అది ఎంతవరకు అంటే.. నువ్వింతే ఇంతకు మించి నువ్వేం చేయలేవని డిసైడ్ చేసి నీకే బాసై కూర్చుంటుంది.. అంటూ రాజా రవీంద్ర చెప్తున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన సారంగదరియా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ జులై 12న సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్స్ కడలి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.