ప్రపంచంలో కొత్తగా గుర్తింపు పొందిన ఏడు వింత ప్రదేశాలు, కట్టడాలను ఓ ఈజిప్షియన్ ఏడు రోజుల్లో సందర్శించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన యాత్రకు సంబంధించిన అంశాలతో ఓ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి న మగ్డీ ఎయిస్సా (45) మాట్లాడుతూ, 6 రోజుల, 11 గంటల, 52 నిమిషాల్లో ఈ రికార్డును సృష్టించానని చెప్పారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో యాత్ర ప్రారంభమైందని, ఆ తర్వాత తాజ్ మహల్, పురాతన నగరం పెట్రా, కొలోసి యం, క్రైస్ట్ ది రిడీమర్, పెరూలోని మచ్చు పిచ్చులను సందర్శించానన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మాత్ర మే ఉపయోగించుకున్నట్లు తెలిపారు.