హీరో గోపిచంద్ తాజా చిత్రం సిటీమార్ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. దాంతో ఇప్పటికే తొలికాపీ సిద్ధం చేసుకున్న గోపీచంద్ మూవీ ఆరడుగుల బుల్లెట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోపీచంద్, నయనతార ప్రధాన బి.గోపాల్ తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా కొన్ని కారణాలతో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ అందించారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.