గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిమజ్జంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జానానికి ఈ సారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా అనుమతివ్వాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసిన 48 గంటల్లోనే క్లీన్ చేస్తున్నామని, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈసారికి అనుమతివ్వాలని కోరింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్వూ పిటిషన్ వేసింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జానికి అనుమతివ్వాలని కోరింది. ఇప్పటికిప్పుడు బేబీపాండ్స్ ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వినాయక నిమజ్జంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హూస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్ఞనం చేయాలని హైకోర్టు తెలిపింది.