గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరనే సస్పెన్స్‌కు తెరపడిరది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ (59) ఎన్నికయ్యారు. బీజేపీ లెజిస్టేచర్ పార్టీ లీడర్‌గా పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర అబ్జర్వర్లు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్‌జోషీ, పార్టీ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ సమక్షంలో ఎన్నిక జరిగింది. పటేల్ పేరును సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీయే ప్రతిపాదించారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం నేడు జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు. కేవలం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మాత్రమే జరుగుతుందని, కొత్త కేబినెట్ త్వరలోనే ఏర్పడుతుందని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి గురించి లెజిస్లేచర్ మీటింగ్‌లో చర్చించలేదన్నారు.