వినాయక నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సక కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నిమజ్జనం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహం పెట్టాలని కమిటీ నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 70 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని కమిటీ ప్రతిష్ఠించనుంది. మండపంలోనే నిమజ్జనం చేయాలనే నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కమిటీ తీర్మానించింది.