ఉక్రెయిన్‌తో గత రెండేండ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో రష్యాకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నా యి. రష్యాకు ఉక్రెయిన్ను నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులకు పాల్పడగా, ఇప్పుడు ఉక్రెయిన్ కూడా అదే పంథా తీసుకొన్నది. ఇటీవల రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు వెళ్లాయి. కుర్సు రీజియన్‌లో దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఒలెస్కాండర్ సిర్స్కీ వెల్లడించారు.
సరిహద్దును దాటి రష్యా భూభాగంలోకి చొరబడిన తర్వాత ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు తొలిసారిగా అధికారికంగా స్పందించారు. మరోవైపు రష్యా భూభాగంలోకి తమ బలగాలు వెళ్లిన అంశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ధ్రువీకరించారు. తాము అధీనంలోకి తీసుకొన్న భూభాగంలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రణాళికలు వేయాలని ఆదేశించినట్టు తెలిపారు.