థాయ్‌లాండ్‌లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ప్రధాన ప్రతిపక్షాన్ని వారం రోజుల క్రితమే రద్దు చేసిన రాజ్యాంగ న్యాయస్థానం ఇప్పుడు మరో సంచలన తీర్పును ప్రకటించింది. ఒక కేసులో శిక్షపడిన పిచిట్ అనే వ్యక్తిని స్రెట్టా థావిసిన్ తన క్యాబినెట్ సభ్యుడిగా నియమించడంపై విచారించిన రాజ్యాంగ న్యాయస్థానం 5:4తో ఆయనకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. ఆయన తక్షణం తన కార్యాలయాన్ని వదిలివెళ్లాలని ఆదేశించింది.