సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా మానాన్న సూపర్‌హీరో. ఆర్ణ కథానాయికగా. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే కంటెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి దసరా బెస్ట్ సీజన్ అనీ, ప్రేమ, అనుబంధాల నిజమైన అర్థాన్ని తెలుసుకోడానికి ఓ తండ్రీకొడుకులు చేసిన ప్రయాణమే ఈ సినిమా కథని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: జైక్రిష్.