Skip to main content

Namaste NRI

అమెరికా మరో కీలక నిర్ణయం 

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 19 దేశాల ప్రజల నుంచి వచ్చే గ్రీన్‌ కార్డులు, పౌరసత్వ అభ్యర్థనలు, వీసాలు వంటి ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం తన పరిశీలన విధానాలను తిరిగి పరిశీలిస్తోంది దీంతో ఈ సమయంలో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారులు అన్ని దరఖాస్తులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించినట్టు వివరించింది. ఈ 19 దేశాలు ఇప్పటికే ట్రంప్‌ అమలు చేసిన ట్రావెల్‌-బ్యాన్‌ జాబితాలో ఉన్నవే. ఈ ప్రభావిత దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, చాద్‌, కాంగో రిపబ్లిక్‌, ఈక్వాటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతి, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌, బురుందీ, క్యూబా, లావోస్‌, సియెర్రా లియోన్‌, టోగో, టుర్క్‌మెనిస్తాన్‌, వెనిజులాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News