బ్రిటన్ ప్రధాని తన క్యాబినేట్‌లో మంత్రులుగా ఇద్దరు భారతీయులను నియమించారు. రిషి సునక్ ఇన్ఫోసిస్ సహ భాగస్వామి నారాయణమూర్తి అల్లుడు కాగా, రిషి సునక్ ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన మరోసారి పదవిలో కొనసాగేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రీతి పటేల్ హోం శాఖ కార్యదర్శిగా 2019 జూలై నుంచి పనిచేస్తున్నారు. ఆమెను ఆ పదవి నుండి తొలగిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించినప్పటికీ తిరిగి ఆమె తన పదవిలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన డోమినిక్ రాబ్, న్యాయశాఖ కార్యదర్శి పదవిని చేపట్టనున్నారు. అలాగే వాణిజ్య శాఖ మంత్రిగా లిజ్ ట్రస్‌ని నియమించారు.