అగ్రరాజ్యం అమెరికాలో సెనేట్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వలస వెళ్లిన వారి పిల్లలకు (డాక్యుమెంటెడ్ డ్రీమర్) పౌరసత్వం కల్పించే దిశగా ముందడుగు పడిరది. దీనికోసం సెనేటర్లు అలెక్స్ పడిల్లా (డెమొక్రటిక్ పార్టీ), రాండ్ పాల్ (రిపబ్లికన్) అమెరికా చిల్డ్రన్ యాక్ట్ పేరిట సెనేట్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో సుమారు 2 లక్షల మందికి పైగా డాక్యుమెంటెడ్ డ్రీమర్‌లకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో దీర్ఘకాలంగా నాన్ ఇమిగ్రేషన్ వీసాపై నివాసముంటున్న వారిపై ఆధారపడుతున్న పిల్లలను డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని అంటారు. ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్‌లకు అమరికన్ పౌరసత్వం ఇచ్చేందుకు అమెరికా చిల్డ్రన్ యాక్ట్ వీలు కల్పిస్తోంది. వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అమెరికాకు వచ్చిన భారతీయులే ఉన్నారు. సుమారు 70 శాతం మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం.