ఎమ్మెల్యేకే రాష్ట్ర రాజధానిలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజల సంగతేమిటని ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చూడలేదన్నారు. తొమ్మిది నెలలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రశ్నించిన వారందరిపై దాడులు, కేసులతో భయపెట్టాలని చూస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఇలాంటి వాటికి అదిరేది బెదిరేది లేదన్నారు. రాష్ట్ర డీజీపీ వెంటనే దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యే గాంధీ వాడిని పరుష పదజాలం పై చర్యలు తీసుకొని సాటి ఎమ్మెల్యే హక్కులని కాపాడాలని అనిల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇతరులకు నీతులు చెప్పుడు కాదని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పాలన పై స్పంచించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఎన్నారైలు అంతా మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు.