యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్‌సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్‌పోర్ట్‌లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది. సుమారు 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంలో భాగంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. వీసా ఆన్ అరైవల్ పొందాలనుకొనేవారు కనీసం 6 నెలల చెల్లు బాటు కలిగిన పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం తగిన పాస్‌పోర్ట్, వీసా, శాశ్వత నివాస కార్డులు కలిగిన వారికి 14 రోజుల వీసా ఆన్ అరైవల్ జారీ చేస్తారు.