ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన దాడుల్లో ఇరాన్‌ను భారీగానే దెబ్బతీసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, రాడార్ వ్యవస్థకు నష్టం ఏర్పడిందని, మొత్తం మీద నష్టం పరిమితంగానే ఉందని ఇరాన్ ప్రకటించింది. అయితే వాస్తవానికి ఈ దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి తయారీ ఫ్యాక్టరీ నాశనం అయ్యి, భారీ నష్టం ఏర్పడిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఖైబర్, కాస్సీమ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను శక్తివంతం చేయడానికి ఉపయోగించే భారీ ఇంధన మిక్సర్లపై ఇజ్రాయెల్ వాయు సేన విరుచుకుపడిందని తెలిపింది. దీంతో నాశనమైన ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి రెండేండ్లు పట్టవచ్చునని పేర్కొంది.