Skip to main content

Namaste NRI

బర్త్‌డే స్పెషల్‌ ..కొత్త సినిమా ప్రకటించిన నాగచైతన్య

స్టార్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ద‌ర్శ‌కుడు కార్తీక్ వర్మ దర్శకత్వంలో చైతూ సినిమా చేయ‌బోతున్నాడు. నాగ చైత‌న్య పుట్టిన‌రోజు కానుక‌గా ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు. ఎన్‌సీ24 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో వ‌స్తున్న ఈ చిత్రం సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డేను తీసుకోబోతున్నార‌ని టాక్ న‌డుస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌ల‌పై బోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌తో పాటు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News