ఆసియాలోనే తొలి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు భారత్‌లో అందుబాటులోకి రానున్నదని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. VINATA AeroMobility యువ బృందం రూపొందించిన హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల ప్రయాణానికి, కార్గో రవాణాకు, అత్యవసర వైద్య సేవలకు ఈ ఎగిరే హైడ్రిడ్ కార్లను ఉపయోగించవచ్చని తెలిపారు. హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజనకరమని అన్నారు.