అదృష్ట లక్ష్మీ ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఓ ఆటో డ్రైవర్‌కు ఫ్యాన్సీ నంబర్ రూపంలో అదృష్టం వరించింది. తనకు నచ్చిన నంబర్‌తో ఉన్న లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు. కేరళలో ఓ ఆటోడ్రైవర్‌కు లాటరీలో రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఈ మేరకు ప్రకటించిన ఓనం బంపర్ లాటరీ ఫలితాల్లో టీఈ`645465 నంబరు టికెట్ బంపర్ బహుమతికి ఎంపిక అయింది. టికెన్‌ను కొనుగోలు చేసిన అదృష్టవంతుడు కోచీ సమీపంలో మరాడుకు చెందిన ఆటో డ్రైవర్ పీఆర్ జయపలన్ అని వెల్లడైంది. ఈటికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశారు. ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను అని జయపళన్ తెలిపారు. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పనులను మినహాయించగా రూ.7 కోట్లకు పైగా ఆయనకు దక్కుతాయి.