అక్టోబరులో దుబాయ్‌లో జరిగే ఎక్స్‌పో 2020 ఫెలోస్ కార్యక్రమం కోసం యూఎస్‌ఏ పెలివియన్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంకుర సంస్థ స్టాట్విగ్ వ్యవస్థాపకుడైన సిద్దార్థ చక్రవర్తి ఎంపికయ్యారు. ప్రపంచ స్థాయి యువ నాయకులను ఎంపిక చేసి, వారిని ఇంకా నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు దేశాల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. స్టాట్విగ్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్ లెడ్జర్ ను రూపొందించింది. దీనిద్వారా పంపిణీ వ్యవస్థలో ఉన్న ప్రతి డోసు టీకాను ఏ దశలో ఉన్నది గుర్తించవచ్చు. యూఎస్‌ఏ పెలివియన్ తరపున ఎంపిక కావడాన్ని అరుదైన గుర్తింపుగా భావిస్తున్నట్లు సిద్దార్థ చక్రవర్తి తెలిపారు. మనదేశం నుంచి విద్యుతి ఎనర్జీ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వాని విజయ్, మణిపూర్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడైన రజత్ సేథీ కూడా ఎంపికయ్యారు.