పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియమ్ చిత్రం రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో రానా డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. పంచెకట్టులో కనిపించిన రానా లుక్ అదిరిపోయింది. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటూ స్టేషన్‌లో టాక్ నడుస్తోంది. నేనేవరో తెలుసా ధర్మేంద్ర హీరో అంటూ రానా పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ లుక్ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు.