అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి డెమొక్రటిక్ నేతల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా, కమలా హారిస్‌ను ప్రెసిడెంట్‌ను చేయవచ్చునని డెమొక్రటిక్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించేవరకు కమలాహారిస్‌కు పదవి అప్పగించాలని ఆమె మాజీ కమ్యునికేషన్స్ వ్యవహారా ల డైరెక్టర్ జమాల్ సిమన్స్ బైడెన్‌కు సూచించారు. జో బైడెన్ గొప్ప అధ్యక్షుడు. అయితే ఆయన చేసిన వాగ్దానం, నెరవేర్చాల్సి ఉంది. తన పదవికి రాజీనామా చేసి, కమలా హారిస్‌కు బాధ్యతలు అప్పగించాలి. తద్వారా అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ నిలుస్తారు అని అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి కొన్ని వారాల సమయముంది. అయితే బైడెన్ తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మరో 30 రోజులు చాలని సిమన్స్ గుర్తుచేశారు.