![](https://namastenri.net/wp-content/uploads/2024/11/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-49.jpg)
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ బాధ్యతలను పలుచన చేయకుండా ఆర్థిక సహాయం అందించి తమ కట్టుబాట్ల ను గౌరవించాలని భారత్ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. క్లెమేట్ ఛేంజ్ శిఖరాగ్ర సమావేశం గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. కాప్ 29 వద్ద చర్చల సమయంలో సంపన్న దేశాలు తమ ఆర్థిక బాధ్యతలను మార్చుకునే ప్రయత్నాలను తిరస్కరించాయి. దీంతో పారిస్ 2015 ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన అవసరాన్ని భారత్, చైనా తదితర దేశాలు పునరుద్ఘాటించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-49.jpg)