అఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు, బాలికలు హింసలకు బెదిరింపులకు గురవుతున్నారని, ఇలాంటివి లేకుండా వారి కలల్ని కొనసాగించుకునే హక్కులను కాపాడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భద్రతా మండలి 76వ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బైడెన్ మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిందన్నారు. మనమంతా కలిసి అఫ్గాన్‌లో ఉన్న ప్రజలను కాపాడాలి. ఎలాంటి హింసకు, బెదిరింపులకు లోను కాకుండా అక్కడి మహిళలు, పిల్లలు వారి కలల్ని కొనసాగించే హక్కులను మనం కాపాడాలి అని అన్నారు. తీవ్రవాదంపై అమెరికా తనను తాను కాపాడుకుంటూనే దాని మిత్రదేశాలను కూడా కాపాడుకుంటుందన్నారు.